ప్రేమ పేరుతో మోసం.. యువతిని ఇంట్లోనే నిర్బంధించి..

7 Jul, 2021 21:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పశ్చిమ గోదావరి: తనను ప్రేమించి వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ప్రియుడిని నిలదీయాలని ఓ యువతి బెంగళూరు నుంచి పశ్చిమగోదవరికి వచ్చింది. ప్రియుడి ఇంటికి వెళ్లిన ఆ యువతిని సదరు యువకుడు ఇంట్లో నిర్బంధిచాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన రమేశ్‌ అనే యువకుడు బెంగళూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం కొన్ని రోజులకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న ప్రియురాలు బెంగుళూరు నుంచి ప్రియుడి ఇంటికి వచ్చింది.

ఈ క్రమంలో ప్రియుడు రమేష్‌, అతని తల్లిదండ్రులు ఆ యువతిని ఇంట్లోనే నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న వీరవాసరం పోలీసులు నిర్బంధంలో ఉన్న అమ్మాయిని విడిపించారు. ఆమె ప్రియుడు రమేష్‌, అతని తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రియుడు రమేష్, మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్వాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు