ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ముగ్గురు పిల్లలతో సహా..

29 Sep, 2021 16:37 IST|Sakshi

చండీగఢ్‌: హర్యానాలోని పాల్వాల్‌ జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులతో పాటు ముగ్గురు చిన్నపిల్లలు మృతి చెంది ఒక గదిలో విగతజీవులుగా కనిపించారు. ప్రస్తుతం ఈ సంఘటన ఔరంగాబాద్‌ ప్రాంతంలో కలకలంగా మారింది. కాగా, కుటుంబంలో ఏర్పడిన గొడవల కారణంగానే  సాముహిక ఆత్మహత్యలకు పాల్పడినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.

మృతి చెందిన వారి ముఖాలపై, గొంతులపై కత్తిపోట్లు ఉన్నాయి. కాగా, కుటుంబ పెద్ద మాత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ సజ్జన్‌ సింగ్‌ తెలిపారు. 

చదవండి: Traffic Challan కమిషనర్‌ ఆఫీస్‌ ఎదుట బుల్లెట్‌ యజమాని ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు