ఇన్‌స్టా రీల్స్‌ సోషల్‌ మీడియలో పెడతానంటూ.. లైంగిక వేధింపులు

4 Aug, 2021 20:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తమిళనాడు: నమ్మి స్నేహం చేసిన యువతిపైనే లైంగిక వేధింపులకు పాల్పడుతూ డబ్బులు దండుకోవాలని చూశాడో వ్యక్తి. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్‌ గురించి ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని మదురైకి చెందిన ఓ యువతికి సంతోష్‌ కుమార్‌ అనే వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో రెండేళ్ల క్రింతం పరిచియం ఏర్పడింది. వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. దీంతో ఇద్దరు కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు(రీల్స్‌) చేయడం మొదలుపెట్టారు.

వారిద్దరు కలసి సన్నిహితంగా ఉంటూ చేసిన పలు వీడియోలను సోషల్‌ మీడియోలో పెడతానని సంతోష్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ లైంగికంగా వేధించాడు. అంతటిలో ఆగకుండా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని యువతి తన తల్లిదండ్రులకు వేధింపుల విషయాన్ని చెప్పింది. యువతి తల్లి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంతోష్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు