ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డ మైనర్ బాలురు

6 Nov, 2021 09:35 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ మండలం సుజాతనగర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలపై, ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడి ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలపై అదే గ్రామానికి చెందిన 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్‌ బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. సాయంత్రం సమయంలో బాలికలతో ఆడుకుందాం అని చెప్పి ఒక ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు.
చదవండి: (టిక్‌టాక్‌ భార్గవ్‌కు మళ్లీ రిమాండ్‌)

అదే సమయంలో పక్కన ఉన్న వేరొకరు చూసి అరవడంతో బాలురు ఇద్దరు బయటకు పారిపోయారు. బాలికల తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో బాలురుపై స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు బాలురుపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం శనివారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. దారుణానికి పాల్పడ్డ బాలురుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: (వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి దారుణం)

మరిన్ని వార్తలు