Mysore Case: ఎంబీఏ విద్యార్థినిపై లైంగికదాడి: కటకటాల్లోకి కామాంధులు

30 Aug, 2021 07:50 IST|Sakshi
నిందితుల్లో నలుగురు.. దుండగులను ఉరితీయాలని చిత్రకారులు వేసిన పెయింటింగ్‌

కామాంధులకు పోలీసు కస్టడీ

సాక్షి, మైసూరు: మైసూరు నగరంలో చాముండికొండ లలితాద్రి పురంలో ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్టుచేసిన ఐదుగురు నిందితులను శనివారం రాత్రి మైసూరు నగర పోలీసులు మైసూరు మూడవ జేఎంఎఫ్‌సీ జడ్జి ఎదుట హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం వారిని 10 రోజుల పోలీసు కస్టడీకి ఇస్తున్నట్లు తెలిపారు.

తమిళనాడుకు చెందిన నలుగురు నిందితులను తిరుపూరులో అరెస్టు చేసి మైసూరుకు తీసుకొచ్చి వారిని రహస్య స్థలంలో విచారించి వివరాలను సేకరించారు. తరువాత మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన అనంతరం మొత్తం ఆరు మందిని కలిపి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఈ 10 రోజుల కస్టడీలో పోలీసులు మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. వీరు మరికొన్ని అత్యాచారాలకు, దోపిడీలకు పాల్పడి ఉంటారనే అనుమానాలున్నాయి.  

కళాకారుల ప్రదర్శన  
గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన నిందితులను వెంటనే ఉరి తీయాలని కళాకారులు వినూత్నంగా కోరారు. దేవరాజు మొహల్లా రోడ్డులో గోడల పైన చిత్ర కళాకారులు రాహుల్‌ మనోహర, సుమంత్‌గౌడలు కామాంధులకు ఉరి వేసినట్లు చిత్రాలను గీశారు. 

చదవండి: Mysore Case: వీడియోలు తీసి.. 3 లక్షలు డిమాండ్‌ చేశారు
 

మరిన్ని వార్తలు