పెళ్లయిన ఆరు నెలలకే ఆత్మహత్య

17 Jun, 2021 15:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

క్రిష్ణగిరి/కర్ణాటక: గర్భిణి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సింగారపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. క్రిష్ణగిరి జిల్లా సింగారపేట సమీపంలోని నాయకనూరు గ్రామానికి చెందిన రాజేశ్వరి(21)కి సేలంకు చెందిన రాంకీ(26)తో ఆరు నెలల క్రితం పెళ్లి జరిగింది. ప్రస్తుతం రాజేశ్వరి రెండు నెలల గర్భిణి. మంగళవారం రాత్రి రాజేశ్వరి తన గదిలో ఉరివేసుకుంది. రాంకీ కేకలు వేయగా రాజేశ్వరి తల్లితండ్రులు వచ్చారు. అప్పటికే రాజేశ్వరి విగతజీవిగా కనిపించింది.  సింగారపేట పోలీసులు శవాన్ని ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ కలెక్టర్‌ కేసు దర్యాప్తు చేపట్టారు.   

హత్య కేసులో నిందితుని అరెస్ట్‌ 
హోసూరు: హొసూరులో ఈనెల 12న చోటు చేసుకున్న పారిశ్రామిక వేత్త బాలాజీ హత్యోదంతానికి సంబంధించి మరో నిందితుడు మోహన్‌ను మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే  హోసూరు వసంత్‌ నగర్‌కు చెందిన రఘురామ్‌(26) అనే నిందితున్ని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.   

చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్న 13 రోజులకే...

మరిన్ని వార్తలు