పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి, నాలుగు నెలలకే..

23 Mar, 2021 11:21 IST|Sakshi

తెనాలిరూరల్‌: యుక్త వయసు ఆకర్షణలో చేసుకున్న ప్రేమ వివాహం ఆ యువతికి నాలుగు నెలల్లోనే నూరేళ్లు నిండేలా చేసింది. రూరల్‌ ఎస్‌ఐ మన్నెం మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కంచర్లపాలేనికి చెందిన బుల్లా మరియదాసుకు ఇద్దరు భార్యలు. ఒకామె కంచర్లపాలెంలోనే ఉండగా, మరొకామె కృష్ణాజిల్లా గుడివాడలో ఉంటోంది. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో మరియదాసు గుడివాడలో ఉండిపోయాడు.

తెనాలిలోని అతని 21 ఏళ్ల కుమారుడు గోపి (పెయింటింగ్‌ కార్మికుడు) గుడివాడలోని తండ్రి వద్దకు వెళ్లి కొన్నాళ్లు అక్కడే ఉన్నాడు. అక్కడ పక్కింట్లో నివసించే పూర్ణకంటి సాహితి (18)ని ప్రేమించి పెద్దలకు ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్నాడు. భార్యను కంచర్లపాలెం తీసుకురాగా, ఆమె ఆదివారం రాత్రి ఉరివేసుకుని మృతిచెందింది. భర్త, అత్తామామలే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాహితికి ఇంకా మైనారిటీ తీరలేదని సమాచారం. 

చదవండి : హాస్టల్‌ పైనుంచి దూకి బీటెక్‌ స్టూడెంట్‌ మృతి, వీడియో వైరల్‌
‘మామ్‌ సారీ.. ప్లీజ్‌ గివ్‌ లెటర్స్‌ టు మై ఫ్రెండ్స్’

మరిన్ని వార్తలు