రియల్‌ ఎస్టేట్‌ గొడవలకు కుటుంబం బలి

22 Aug, 2022 01:40 IST|Sakshi
హోటల్‌ గదిలో బలవన్మరణం చెందిన సూర్యప్రకాశ్‌ కుటుంబం 

భార్య, ఇద్దరు పిల్లలకు కేక్‌లో విషమిచ్చి..

హోటల్‌ గదిలో ఉరివేసుకున్న వ్యాపారి

భాగస్వాముల వేధింపులే కారణం!

మృతుడి కుటుంబానిది ఆదిలాబాద్‌ జిల్లా 

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘటన

ఖలీల్‌వాడి (నిజామాబాద్‌అర్బన్‌)/ఆదిలాబాద్‌ టౌన్‌: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగస్వాముల వేధింపుల కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన కొత్తకొండ సూర్యప్రకాశ్‌ కుటుంబం ఏడెనిమిదేళ్లనుంచి నుంచి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. సూర్యప్రకాశ్‌ కొంతమంది పార్ట్‌నర్స్‌తో కలసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు.

వెంచర్‌ నిర్వహణలో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. వ్యాపార నిర్వహణకు ఇంకా పెట్టుబడి పెట్టాలని భాగస్వాములు అతనిపై ఒత్తిడి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సూర్యప్రకాశ్‌ నివాసానికి పార్ట్‌నర్స్‌ వెళ్లి గొడవపడినట్లు తెలిసింది. సూర్యప్రకాశ్‌ను అతని భార్య, కూతురు, కుమారుడిని కొట్టి, బెదిరింపులకు పాల్పడ్డారు. వీరి వేధింపులు తాళలేక సూర్యప్రకాశ్‌ కుటుంబం ఈ నెల 4న నిజామాబాద్‌లోని ఓ హోటల్‌లో దిగింది.

అప్పటినుంచి హోటల్‌లోని రూం నంబర్‌ 101 లోనే ఉంటున్నారు. కాగా, ఆదివారం ఉదయం హోటల్‌ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి తలుపు తట్టగా ఎంత సేపటికీ తెరుచుకోకపోవడంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. హోటల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాలుగో టౌన్‌ పోలీసులు గదిని తెరిచారు. లోపల కొత్తకొండ సూర్య ప్రకా శ్‌ (37) ఉరి వేసుకుని చనిపోగా భార్య అక్షయ (36), కూతురు ప్ర త్యూష (13) కొడుకు అద్వైత్‌ (10) విష ప్రభావంతో మృతి చెందారు.

కేక్‌లో విషం కలిపి ముందుగా భార్య, కూతురు, కుమారుడికి తినిపించి వారు మృతి చెందారని నిర్ధారించుకున్న తర్వాత సూర్యప్రకాశ్‌ చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావి స్తున్నారు. హోటల్‌ గదిలో సూర్యప్రకాశ్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సూసైడ్‌ నోట్‌లో కొందరు రియల్‌ ఎస్టేట్‌ పార్ట్‌నర్స్‌ వేధిస్తున్నట్లు పేర్కొంటూ, వారి పేర్లు రాశారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. 

ఆదిలాబాద్‌కు వలస వెళ్లి సూర్యప్రకాశ్‌ తల్లిదండ్రులు
నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కొత్తకొండ అనుసూయ, కృష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి కుటుంబం నలభై ఏళ్ల క్రితం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి వలస వెళ్లింది. ఆదిలాబాద్‌ పట్టణంలోని భుక్తాపూర్‌లో హార్డ్‌వేర్‌ షాప్‌ ఏర్పాటు చేశారు. చిన్న కుమారుడైన సూర్యప్రకాశ్‌ ఆది లాబాద్‌లోనే పుట్టి పెరిగారు. వీరి కుటుంబం హార్డ్‌వేర్‌ షాప్‌ తో పాటు పట్టణంలో పెట్రోల్‌బంక్‌ను కూడా ఏర్పాటు చేసింది.

ఆర్థికంగా వృద్ధి చెందడంతో సూర్యప్రకాశ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారంకోసం ఏడెనిమిదేళ్ల క్రితం ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు మకాం మా ర్చారు. సూర్యప్రకాశ్‌ భార్య అక్షయది ఆదిలాబాద్‌ జిల్లా జైన థ్‌ మండలం దీపాయిగూడ గ్రామం. కాగా హైదరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. లాక్‌డౌన్‌ సమ యంలో శంకరంపేట సమీపంలో భాగస్వాములతో కలసి వెంచర్‌ ఏర్పాటు చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.

వ్యాపా రంలో నష్టం రావడంతో అప్పుల కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. దానికితోడు బిజినెస్‌ పార్ట్‌నర్‌లు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈనెల 4న హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు వచ్చి ఓ హోటల్‌లో దిగారు. రెండు, మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లోని వారి బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతంలో సైతం కుటుంబ సమేతంగా పాల్గొన్నారని తెలిసింది. 

మరిన్ని వార్తలు