రూ.15 కోట్లు కోసం ఒత్తిడి.. పక్కా ప్రణాళికతో హత్య

21 Aug, 2021 10:22 IST|Sakshi
రాహుల్‌ భౌతికకాయం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు

సాక్షి, విజయవాడ : నగరంలో జరిగిన యువ పారిశ్రామికవేత్త రాహుల్‌ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పక్కా స్కెచ్‌తోనే హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మెడకు తాడు బిగించి, ముక్కుపై దిండు అదిమిపెట్టి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో లభించిన సాక్ష్యాధారాలతో విజయ్‌కుమార్‌ను ప్రధాన ముద్దాయిగా గుర్తించారు. వ్యాపార లావాదేవీలే రాహుల్‌ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నిరోజులుగా రాహుల్‌, వ్యాపార భాగస్వామి విజయ్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. తన వాటా రూ.15 కోట్లు ఇచ్చేయాలంటూ రాహుల్‌పై విజయ్ ఒత్తిడి తెచ్చాడు.

నిందితుడు విజయ్ గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడాడు. ఎన్నికల్లో ఓటమితో భారీగా నష్టపోయానని.. వెంటనే డబ్బులివ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. రాహుల్ కాలయాపన చేస్తుండటంతో పక్కా ప్రణాళికతో హత్య చేశాడు. ఈ కేసులో విజయ్‌తో పాటు మరో 8 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రాహుల్ హత్య కేసులో తెరపైకి కోగంటి సత్యం అనుచరుడు
రాహుల్ హత్య కేసులో పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌ హత్య కేసు ప్రధాన నిందితుడు శ్యామ్ పేరు తెరపైకి వచ్చింది. శ్యామ్‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్యామ్ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం అనుచరుడు. రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు విచారణలో రాహుల్ కుటుంబ సభ్యులు కోగంటి సత్యం పేరు చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇప్పటికే కోగంటి సత్యంను విచారించారు.

చదవండి : రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం?

మరిన్ని వార్తలు