సైదాబాద్‌ హత్యాచార ఘటన: రోడ్డుపై బాధితుల ఆందోళన

10 Sep, 2021 14:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బస్తీవాసులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో సాగర్‌ జాతీయ రహదారిపై బైఠాయించి.. నిరసన తెలపడంతో అక్కడ రాకపోకలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. ఈ క్రమంలో అధికారులు ట్రాఫిక్‌ మళ్లించారు. 

బాధితుల నిరసన గురించి తెలుసుకున్న హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తాం.. నెల రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబానికి 50 వేల రూపాయల చెక్‌ అందజేశారు. అంతేకాక కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ జాబ్‌ ఇస్తామని.. కలెక్టర్‌ పరిధిలో ఏం ఇవ్వగలమో అవన్ని అందేలా చూస్తామని తెలిపారు. (చదవండి: సైదాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి)

డీసీపీ రమేష​ మాట్లాడుతూ.. ‘‘ఈ కేసును ఫాస్ట్రాక్‌ కోర్టు ద్వారా వేగవంతం చేసేలా చేస్తాం.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం. బాధితుల నిరసనలో పోలీసులకు గాయాలు అయ్యాయి. చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సాగర్‌రోడ్డుపై పూర్తిగా రాకపోకలు బంద్‌ చేశాము. ఉద్రిక్తత పరిస్థితులు దృష్ట్యా భారీగా పోలీసులను మోహరించాం’’ అని తెలిపారు. 

చదవండి: ‘మా కూతురి మెడపై ఉరివేసిన గుర్తులున్నాయి’

మరిన్ని వార్తలు