బయటకు స్పా సెంటర్‌.. కానీ లోపల అందమైన అమ్మాయిలతో..

25 May, 2022 11:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాదాపూర్‌(హైదరాబాద్‌): స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న సంఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్‌పెక్టర్‌ రవీంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని పిల్లర్‌ నంబర్‌ 1725 వద్ద విసన్‌ ఫ్యామిలీ సెలూన్‌ అండ్‌ స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం  సాయంత్రం 6గంటల సమయంలో దాడి చేశారు.
చదవండి: మాదాపూర్‌: ఓయో రూంలో వ్యభిచారం చేస్తూ..

దీంతో నిర్వాహకులు సరూర్‌నగర్‌కి చెందిన రాసుల మంగ(36), సహా నిర్వాహకులు కూకట్‌పల్లికి చెందిన కొండురు పాక సురేష్‌, విక్కీ, కస్టమర్‌ లింగంపల్లికి చెందిన కాకి సునంద్‌ (22), ముంబై, వెస్ట్‌బెంగాల్‌కి చెందిన విక్టిమ్‌ మిన్న హర్‌కతున్‌(22)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.2వేలు నగదు,  బ్లాక్‌ కలర్‌టీవీ, ఒప్పో గోల్డ్‌ కలర్‌ సెల్‌ఫోన్, వీవో బ్లూ కలర్‌ మొబైల్‌ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు