ప్రియుడి కోసం బిడ్డను హింసించిన తల్లి.. అరెస్ట్ చేసిన పోలీసులు

31 Aug, 2021 15:27 IST|Sakshi
పోలీసుల అదుపులో తులసి

సాక్షి,చెన్నై: వివాహేతర సంబంధాన్ని భర్త బహిర్గతం చేయడంతో.. పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను హింసించి రాక్షసానందం పొందుతున్న  మహిళను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల చిన్నారిని కొడుతున్న సమయంలో తీసిన వీడియోలు వైరల్ అయిన విషయం  తెలిసిందే. వివరాలు.. తమిళనాడు లోని విల్లుపురం జిల్లా మనలప్పాడి మధురమేట్టూర్‌ గ్రామానికి చెందిన వడివళగన్‌, చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని కొన్నేళ్ల కిందట పెళ్ళి చేసుకున్నాడు.

వీరికి గోకుల్‌ (4), ప్రదీప్‌ (2) కుమారులు ఉన్నారు. తరూచూ బార్య భార్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన బిడ్డ ప్రదీప్‌ను తీవ్రంగా కొట్టి దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. భర్త వడివలగన్‌ సత్యమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి తులసిని ఆంద్రప్రదేశ్‌లో అరెస్టు చేశారు.

చదవండి: కుక్కర్‌లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్‌ ఫీజు ఒక్క రూపాయే!

మరిన్ని వార్తలు