ఇంకా పరారీలోనే ధూళిపాళ్ల నరేంద్ర

24 Nov, 2023 12:24 IST|Sakshi

సాక్షి, గుంటూరు: సంగం డెయిరీకి పాలు పోయించుకుని బోనస్‌ ఇస్తామంటూ ధూళిపాళ్ల నరేంద్ర మోసానికి తెరతీసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు.

ఈ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే  ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ భయంతో ఎనిమిది రోజుల నుంచి ధూళ్లిపాళ నరేంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. ధూళిపాళ్లతో పాటు ఆయన అనుచరులు పరారీలో ఉండగా, ఎనిమిది రోజుల నుంచి వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైతులపై దాడి చేసిన ధూళ్లిపాళ్ల అనుచరులు సంగం డెయిరీలో దాక్కున్నారన్న సమాచారంతో డెయిరీకి పోలీసులు వెళ్లగా, లోపలికి రానివ్వకుండా ధూళ్లిపాళ్ల అనుచరులు డెయిరీ గేట్లు మూసివేశారు.
చదవండి: ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్మడమే రఘురామ ధ్యేయం

మరిన్ని వార్తలు