టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి..

11 Apr, 2021 09:34 IST|Sakshi
చికిత్స పొందుతున్న స్వామినాయక్, లక్ష్మి దంపతులు  

పొలం పనుల్లో నిమగ్నమైన దంపతులపై దాడి

అవమాన భారంతో భార్యాభర్త ఆత్మహత్యాయత్నం 

గుంతకల్లు రూరల్‌: టీడీపీ నాయకుడి దౌర్జన్యం ఓ కుటుంబానికి కంటి మీద కునుకు దూరం చేసింది. బతికేందుకు ఉన్న ఒక్క ఆధారమైన భూమిని లాక్కొనేందుకు ఆ నేత సాగించిన దాడి.. వారి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. బాధితుల సమాచారం మేరకు..  గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్ద తండా గ్రామానికి చెందిన స్వామి నాయక్, లక్ష్మి దంపతులు. తమ తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా వీరికి మూడు ఎకరాల పొలం సంక్రమించింది. ఈ భూమిలో పంట సాగు చేస్తూ తన భార్య బిడ్డలను స్వామినాయక్‌ పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ భూమిపై స్థానిక టీడీపీ నేత మీటూ నాయక్‌ కన్నేశాడు. ఆ భూమి తనదంటూ తరచూ దౌర్జన్యం చేస్తూ వచ్చేవాడు.

తన్ని.. మెడపట్టి గెంటి 
శనివారం స్వామి నాయక్‌ దంపతులు తమ పొలంలో పనులు చేసుకుంటుండగా.. మీటూ నాయక్‌ తన కుటుంబసభ్యులు భాస్కరనాయక్, మధు నాయక్, బాలాజీ నాయక్, వెంకటేష్‌ నాయక్‌తో కలిసి అక్కడకు చేరుకున్నాడు. ఆ పొలం తమదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లాలంటూ స్వామినాయక్‌ దంపతులను గద్దించారు. స్వామినాయక్‌ ఎదురు ప్రశ్నించడంతో అతడిపైన అతడి భార్యపైన దాడికి తెగబడ్డారు.

అనంతరం మెడపట్టి గెంటేశారు. మనస్థాపంతో ఇంటికి చేరుకున్న స్వామి నాయక్‌ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమై బాధితులను ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గుంతకల్లు రూరల్‌ ఎస్‌ఐ వలీబాషా ఆస్పత్రికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
చదవండి:
సినిమా తరహా పక్కా స్కెచ్‌: అనాథగా అవతారమెత్తి..
కూన తీరు మారదు.. పరుగు ఆగదు!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు