ఈటింగ్‌ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి

30 Oct, 2021 16:26 IST|Sakshi

ఈటింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొన్న ఓ విద్యార్థిని మృతిచెందిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. గెలవాలనే తొందరలో ఆహారం గొంతులో ఇరక్కుపోయి, ఊపిరాడక అర్థాంతరంగా తనువుచాలింది. అసలేంజరిగిందంటే..

అమెరికాలో టఫ్ట్స్‌ యూనివర్సిటీ గతవారం హాట్‌ డగ్స్‌ ఈటింగ్ కాంపిటీషన్‌ నిర్వహించింది. ఈ కాంపిటీషన్‌లో అదే యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చదువుతున్న మడ్లిన్‌ అనే 20 ఏళ్ల విద్యార్థిని కూడా పాల్గొంది. ఐతే హఠాత్తుగా హాట్‌ డగ్ గొంతులో ఇరుక్కుపోవడంతో, ఊపిరిఆడక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్వహణ బృందం హుటాహుటిన బోస్టన్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఎంతప్రయత్నించినా ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత రోజు ఆమె మరణించిందని వైద్యులు మీడియాకు వెల్లడించారు. నిజానికి ఆమె ఒక గొప్ప అథ్లెట్‌ కూడా. ఈ విషాద సంఘటన తాజాగా వెలుగుచూసింది.

చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

మరిన్ని వార్తలు