బస్సు లోయలో పడిన ఘటన: బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం

1 Nov, 2021 19:17 IST|Sakshi

డెహ్రాడూన్‌:  ఉత్తరాఖండ్‌ బస్సులోయలో పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం లక్షచోప్పున ఎక్స్‌గ్రెషియాను ఇస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజేశ్‌కుమార్‌ తెలిపారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన వారికి 40,000 వేల రూపాయలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

నిన్న (ఆదివారం) బైల గ్రామం నుంచి వికాస్‌నగర్‌కు బయలు దేరిన బస్సు.. చక్రాటా అనే ప్రాంతంలో అదుపుతప్పి 300 అడుగుల లోతున పడింది. ఈ ఘటనలో  13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. 

చదవండి: 300 అడుగుల లోతున పడిన బస్సు.. 13 మంది మృతి

మరిన్ని వార్తలు