రాహుల్‌ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు

22 Aug, 2021 20:10 IST|Sakshi
కోరాడ విజయ్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, విజయవాడ: స్థానికంగా కలకలం రేపిన వ్యాపారి రాహుల్‌ హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్ హత్య కేసు ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌ మాచవరం పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయాడు. రాహుల్ హత్య కేసులో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు A-1 కోరాడ విజయ్, A-2 కోగంటి సత్యం, A-3 విజయ్ భార్య పద్మజ, A-4 పద్మజ, A-5  గాయత్రి పేర్లను పేర్కొన్నారు.

రాహుల్ తండ్రి రాఘవరావు స్టేట్‌మెంట్ ఆధారంగా సెక్షన్ 302, 120బి, రెడ్‌విత్‌ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్‌తో కలిపి పోలీసులు అదుపులో ఉన్నవారి సంఖ్య 6కు చేరింది. మాచవరం పోలీసుల ముమ్మర విచారణ కొనసాగుతోంది.
(చదవండి: King Cobra: 13 అడుగుల గిరినాగు)


హత్యకు గురైన రాహుల్‌.. అతని మృతదేహం లభ్యమైన కారు

మరిన్ని వార్తలు