ఆర్థిక లావాదేవీలే  కారణం 

3 Sep, 2021 03:48 IST|Sakshi
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు 

వరంగల్‌ హత్యాకాండ ఘటనలో ఆరుగురు అరెస్ట్‌ 

వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి వెల్లడి

సాక్షిప్రతినిధి, వరంగల్‌: సంచలనం సృష్టించి న వరంగల్‌ హత్యాకాండకు షఫీ, అతని అన్న చాంద్‌పాషాల మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీలే కారణమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి చెప్పారు. దీనివెనుక ఆరుగురు నిందితులు ఉన్నారని, వారిని ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. గురువారం పోలీస్‌ కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం తెల్లవారుజామున వరంగల్‌ ఎల్బీనగర్‌ ప్రాంతంలో అన్న చాంద్‌పాషాతోపాటు వదిన సబీరాబేగం, బావమరిది ఖలీల్‌ని షఫీ పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితులు షఫీని, అతనికి సహకరించిన బోయిని వెంక న్న, ఎండీ సాజీద్, రాగుల విజేందర్, ఎండీ మీరా అక్బర్, ఎండీ పాషాలను రిమాండ్‌కు తరలించనున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు.

షఫీ, చాంద్‌పాషా పదేళ్ల క్రితం పరకాల నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడ్డారని చెప్పా రు. వీరు పరకాల, జంగాలపల్లి, ఏటూరునాగారం ప్రాంతాల్లో పశువులను కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్‌లోని కబేళాలకు తరలించే వ్యాపారాన్ని నిర్వహించేవారన్నా రు. వచ్చే లాభాన్ని ఇరువురు పంచుకునేవారని, ఇటీవల నష్టాలు రావడంతో ఇద్దరి మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. చెల్లించాల్సిన అప్పులను చెల్లించి తనకు రావాల్సిన వాటా డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా పెద్ద మనుషుల మధ్య పంచా యితీ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో స్నేహితులతో కలిసి షఫీ హత్యలు చేశారని వెల్లడించారు. నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలు తమకేమైనా సమస్యలుంటే సీఐ స్థాయి నుంచి పోలీస్‌ కమిష నర్‌ వరకు నిర్భయంగా ఎవరికైనా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. సమావేశంలో సెంట్రల్‌జోన్‌ డీసీపీ పుష్ప, వరంగల్‌ ఏసీపీ కె.గిరికుమార్, సీఐలు గణేష్, మల్లేష్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు