మద్యం మత్తులో కత్తితో పొడవడానికి వచ్చిన భర్తను..

31 Jul, 2021 06:57 IST|Sakshi
రషియా, నౌషద్‌ (ఫైల్‌)

తిరువొత్తియూరు: మద్యం మత్తులో కత్తితో పొడవడానికి వచ్చిన భర్తను ఓ భార్య కడతేర్చింది. ఈ ఘటన కాంచీపురంలో చోటుచేసుకుంది. కాంచీపురం మల్లిగశెట్టి వీధికి చెందిన నౌషద్‌ (37) ఆటోడ్రైవర్‌. ఇతని భార్య రేవతి అలియాస్‌ రషియా (30). వీరికి భైరవ కుమార్తె, పైసల్‌ అనే కుమారుడు వున్నారు. నౌషద్‌ రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు.

ఈ క్రమంలో నౌషద్‌ గురు వారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి రావడంతో దంపతుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహం చెందిన నౌషద్‌ కత్తితో భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే రషియా అదే కత్తి తీసుకుని అతనిపై దాడి చేసింది. దాడిలో నౌషద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. శివకంచి పోలీసులు రషియాను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు