సాఫ్ట్‌వేర్‌ యువతితో ప్రేమ, పెళ్లి.. మరో మహిళ పరిచయం కావడంతో..

24 Apr, 2022 11:28 IST|Sakshi
భర్త శ్రీమాన్‌ ఇంటి ముందు ధర్నా చేస్తున్న అనూష

మంగళగిరి (గుంటూరు జిల్లా): ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించానంటూ మూడు ఏళ్లు వెంట పడి కులాలు వేరైనా తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం తనను వదిలించుకోవాలని తల్లి, పిన్ని మాటలు వింటూ తనకు అన్యాయం చేస్తున్నాడంటూ ఓ వివాహిత నగరంలోని యర్రబాలెంలో భర్త నివాసం ముందు కూర్చుని ఆందోళన చేసింది. బాధితురాలు అనూష తెలిపిన వివరాల మేరకు అనూషది విశాఖపట్నం కాగా హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో చేస్తున్న యర్రబాలెంకు చెందిన శ్రీమాన్‌ అనూషతో పరిచయం పెంచుకుని ప్రేమించానంటూ వెంటబడ్డాడు.
చదవండి👉: ఇష్టం లేనిపెళ్లి.. నిశ్చితార్థం విషయం తెలిసి యువతి ఏం చేసిందంటే?

సుమారు మూడు సంవత్సరాల పాటు ప్రేమిస్తున్నానని వెంటపడ్డ శ్రీమాన్‌ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వివాహం చేసుకుంటానని చెప్పి అనూషను వివాహం చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. అనంతరం అనూష ఉద్యోగం గ్యారంటీగా చూపి సుమారు రూ.50 లక్షల రుణం తీసుకున్నాడు. శ్రీమాన్‌కు మరో మహిళ పరిచయం కావడం, శ్రీమాన్‌ తల్లి, బంధువులు సైతం అనూషను వదిలేయాలని చెప్పడంతో అనూషతో ప్రతి రోజు గొడవలు పెట్టుకుని పిల్లలు తనకు పుట్టలేదని అనుమానంతో అనూషను వేధించసాగాడు.
చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు 

దీంతో అనూష హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసి తన భర్తకు కౌన్సెలింగ్‌ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరగా హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న శ్రీమాన్‌ యర్రబాలెం తిరిగి వచ్చి తల్లివద్ద ఉంటున్నాడు. హైదరాబాద్‌ పోలీసులు శనివారం స్థానిక పోలీసుల సహాయంతో నోటీసులు ఇచ్చేందుకు శ్రీమాన్‌ ఇంటికి వెళ్లగా శ్రీమాన్‌తో పాటు అతని కుటుంబసభ్యులు నోటీసులు తీసుకునేందుకు ముందుకు రాలేదు. నోటీసులు తీసుకోకపోవడంతో కోర్టు సమన్లతో శ్రీమాన్‌ను అదుపులోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తనకు న్యాయం చేసి తన భర్తను తనకు అప్పగించేవరకు తాను ఆందోళన కొనసాగిస్తానని అనూష తెలిపారు.

మరిన్ని వార్తలు