Sakshi News home page

యాంటీ బయాటిక్స్‌ ప్రమాదకరం

Published Thu, Nov 9 2023 1:30 AM

బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న శాస్త్రవేత్తలు - Sakshi

మంగళగిరి: అన్ని దేశాలలో యాంటీ బయాటిక్స్‌ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోందని, ఇది మానవ జాతి మనుగడకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. నీరుకొండ గ్రామంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో రెండు రోజులపాటు జరగనున్న యాంటీ బయాటిక్స్‌ వాడకం, ప్రత్యామ్నాయ మార్గాలపై అంతర్జాతీయ సదస్సును బుధవారం యూనివర్శిటీ వీసీ డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ అరోరా ప్రారంభించారు. సదస్సుకు ఆరు దేశాల నుంచి ప్రఖ్యాతిగాంచిన 36 మంది శాస్త్రవేత్తలు హాజరై యాంటీ బయాటిక్స్‌ వాడకం, వ్యాధి నిరోధకత, వివిధ రోగాల నివారణపై చర్చించారు. అనంతరం మంగుళూరు నిట్టే యూనివర్శిటీ ఏఎంఆర్‌ ఇన్‌సైట్స్‌, నెదర్లాండ్స్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్త డాక్టర్‌ బుర్రి రంగారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ల సలహా తీసుకుని మాత్రమే యాంటీ బయాటిక్స్‌ వాడాలన్నారు. మితిమీరిన యాంటీ బయాటిక్స్‌ వల్ల శరీరం విషతుల్యమయ్యే ప్రమాదముందన్నారు. అనంతరం బుక్‌లెట్‌ ఆవిష్కరించారు.కార్యక్రమంలో సదస్సు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జయశీలన్‌ మురుగయ్యన్‌, డాక్టర్‌ సుదర్శన్‌ గోవింద రాజన్‌, ప్రొఫెసర్లు వాన్‌దొంగెన్‌, డాక్టర్‌ ఇంద్రాణి కరుణసాగర్‌, డాక్టర్‌ రంజిత్‌ థాఫా, డాక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement