మల్లాచారిది హత్యే!

26 Jun, 2022 16:14 IST|Sakshi

నల్గొండ (శాలిగౌరారం) : శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో ఈ నెల 17న వెలుగుచూసిన మల్లాచారి(38) అనుమానాస్పద మృతి.. హత్యగానే పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. తన సఖ్యతకు అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతోనే అతడి భార్యనే ఘాతుకానికి తెగబడినట్లు తెలిసింది. ఇప్పటికే నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు..  మనిమద్దె గ్రామానికి చెందిన మల్లాచారి కులవృత్తితో పాటు కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు.

మల్లాచారికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రోజువారీ మాదిరిగానే ఈనెల 16న ఇంటివద్ద పనిచేసిన మల్లాచారి శాలిగౌరారంలో బ్యాంకువద్ద పని ఉన్నదని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని మద్యం తాగి రాత్రి మనిమద్దె గ్రామానికి చేరుకున్నాడు. గ్రామ సమీపంలోకి రాగానే బైక్‌ నడపలేని స్థితిలో ఉండగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మల్లాచారిని ఇంటికి చేర్చాడు. అయితే మల్లాచారి ఇంట్లోకి వెళ్లకుండా అరుగుపై నిద్రపోయాడు. తెల్లవారుజామున విగతజీవుడయ్యాడు. దీంతో తన కొడకుది హత్యేనని, కోడలిపైను అనుమానం ఉందని మృతుడి తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఆదినుంచి స్రవంతి ప్రవర్తన అనుమానాస్పదమే..
మృతుడు మల్లాచారి భార్య స్రవంతి ప్రవర్త అదినుంచి అనుమానాస్పదమే గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో స్రవంతి చనువుగా ఉండేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరి వ్యక్తులు మధ్యలు ఘర్షణలు జరిగిన సమస్య పెద్ద మనుషుల వద్దకు చేరినట్లు సమాచారం. అయినప్పటికీ తీరు మారకపోవడంతో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు స్రవంతిపై దాడి చేయగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తి స్రవంతికి దూరం కావడంతో ప్రస్తుతం గ్రామానికి చెందిన మరో ముగ్గురు యువకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలియవచ్చింది.  

గొంతునులిమి..
వివాహేతర సంబంధానికి మల్లాచారి అడ్డుగానే ఉన్నాడనే ఉద్దేశంతోనే హత్య చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల మల్లాచారి మద్యం తాగి ఇంటకి చేరుకుని లోనికి రాకుండా అరుగుపైనే నిద్రించగా గొంతునులిమి హత్య చేసినట్లు సమాచారం. అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులకు స్రవంతి విచారణలో నేరం అంగీకరించినట్లు సమాచారం.  అయితే బలియమైన శరీర సౌష్టంవం కలిగిన మల్లాచారిని అంతమొందించడం స్రవంతి వల్ల కాదని, ఈ హత్యోదంతంలో మరో ఇద్దరు పాత్ర ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత్రధారుల పాత్ర నిగ్గుతేల్చేందుకు ఈ కేసును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

కేసు నుంచి తప్పించుకునేందుకేనా ?
కొడుకు మల్లాచారి మృతిపై కోడలుపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 19న స్రవంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన స్రవంతి అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీస్‌స్టేషన్‌ని బాత్‌రూంలో యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను నల్లగొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం బుధవారం తిరిగి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు