వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి మూడేళ్ల కొడుకుని హతమార్చిన తల్లి

29 Aug, 2022 10:47 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో మానవత్వం నానాటికీ  కానరాకుండా పోతుంది. మానవ సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. తాజాగా ఓమహిళ తొమ్మిది నెలల పేగు బంధాన్ని తెంచుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మూడు సంవత్సరాల కొడుకొని తల్లి హతమార్చింది. ఈ దారుణ ఘటన ముషీరాబాద్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలని పార్మిగుట్టలో నివసాముంటున్న ఓ మహిళ.. నెల రోజుల క్రితం కుర్చీమీద నుంచి కిందపడి తన కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముషీరాబాద్  పోలీసులుకేసు నమోదు చేశారు. అయితే తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి తల్లే హత్య చేయించినట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 
చదవండి: పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్‌ నిర్ణయం..

మరిన్ని వార్తలు