వివాహేతర సంబంధం.. మహిళను కరెంట్‌ పోల్‌కు కట్టేసి.. 

1 May, 2022 11:54 IST|Sakshi

వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళను కరెంట్‌ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. రోహతాస్ జిల్లాలోని సింగపూర్‌కు చెందిన ఓ మహిళ గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఆమెను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆమె భర్త దీపక్‌రామ్‌, మామ, ముగ్గురు పిల్లలు బాధితురాలిని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. 

అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని..  దీపక్ రామ్, అతని తండ్రి శివపూజన్ రామ్, ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్టు రోహాతస్‌ పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ భారతి తెలిపారు.

మరిన్ని వార్తలు