నిజామాబాద్‌ జిల్లాలో విషాదం.. వడదెబ్బ ధాటికి యువతి మృతి

6 Apr, 2022 13:19 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండల ధాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా.. ఎండదెబ్బతో నిజామాబాద్ జిల్లాలో ఓ యువతి మృతి చెందింది. డిచ్‌పల్లి మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన చిన్నోళ్ల సవిత(19) వడదెబ్బకు మృత్యువాత పడటం ఆ గ్రామంలో విషాదం రేపింది. వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురైన సవితను ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. కాగా, జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. గత వారం రోజుల నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మరిన్ని వార్తలు