ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం

6 Dec, 2023 23:42 IST|Sakshi
హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవంలో ప్రసంగిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్‌

కాకినాడ క్రైం: కాకినాడలోని భానుగుడి పోలీస్‌ కన్వెన్షన్‌ హాలులో 61వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీష్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుశాఖకు అనుబంధంగా హోంగార్డులు విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డు వ్యవస్థ ఎంతో కీలకంగా పనిచేస్తుందన్నారు. విజిలెన్స్‌, సీ్త్ర శిశు సంక్షేమశాఖ, ట్రాన్స్‌పోర్టు, ఫైర్‌, సబ్‌జైలు తదితర సర్వీసుల్లో హోంగార్డులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. హోంగార్డుల సంక్షేమాన్ని ప్రభుత్వం గుర్తించిందని, దశలవారీగా వారికి పలు అంశాల్లో ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో హోంగార్డులంతా మరింత అంకిత భావంతో పనిచేసి జిల్లా పోలీసుశాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. అదనపు ఎస్పీలు శ్రీనివాస్‌, సత్యనారాయణ, ఏఆర్‌డిఎస్పీ వెంకటఅప్పారావు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు