దంచికొట్టిన వాన | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వాన

Published Wed, Dec 6 2023 11:42 PM

రాజమహేంద్ర వరంలో చెరువును తలపిస్తున్న పేపర్‌మిల్లు రోడ్‌ - Sakshi

కొవ్వూరు: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో మంగళవారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. డిసెంబర్‌లో భారీస్ధాయిలో ఇంత వాన కురవడం ఇదే ప్రథమం. మూడు రోజుల నుంచి సరాసరి 220.5 మి.మీటర్లు నమోదైందంటే ఎంత ఎక్కువ కురిసిందో అర్ధం చేసుకోవచ్చు. తాళ్లపూడి మండలంలో గడిచిన మూడు రోజుల వ్యవధిలో రికార్డు స్ధాయిలో 288.4 మి.మీ. కురిసింది. పెరవలిలో 282.4, కడియంలో 268.0, గోకవరంలో 245.8 మి.మీ. చొప్పున కురిసింది. కోరుకొండ, బిక్కవోలు, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో మినహా మిగిలిన అన్నీ మండలాల్లోను సరాసరి 20 సెంటీమీటర్లకు పైగా కురిసింది. జిల్లాలో మంగళవారం ఉదయం 8–30 గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకూ సరాసరి 166.9 మి.మీటర్లు కురిసింది. కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌లో సరాసరి 170.2 మి.మీ. కురిస్తే రాజమహేంద్రవరం డివిజన్‌లో 16.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.

రికార్డు స్ధాయి

జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తాళ్లపూడి మండలంలో గరిష్టంగా 232.4 మి.మీ. వర్షం కురిసింది. గోకవరంలో 216.4, కడియంలో 200.2, పెరవలిలో 190.2, కొవ్వూరులో 188.0, నల్లజర్లలో 192.8,సీతానగరంలో 182.6, చాగల్లులో 171.8, అనపర్తిలో 156.2,రంగంపేటలో 164.8, రాజమహేంద్రవరం రూరల్‌లో 162.6, రాజమహేంద్రవరంఅర్భన్‌లో 156, నిడదవోలులో 157.4, ఉండ్రాజవరంలో 148.2, కోరుకొండలో 140.0, బిక్కవోలులో 105.2,గోపాలపురంలో 121.4,దేవరపల్లిలో 128.2 మి.మీ. వర్షం కురిసింది.

3 రోజులూ ముంచేసినా తక్కువే

ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 10002.7 మి.మీ. కురవాల్సి ఉంది. కానీ 920.6 మి.మీ. కురిసింది. అంటే సాధారణం కంటే–8.2 శాతం తక్కువ. గతేడాది ఇదే సమయానికి సరాసరి 1053.9 మి.మీటర్లు వర్షం కురిసింది. డిసెంబర్‌లో సాధారణ వర్షపాతం 17.8 మి.మీ. కురయాల్సి ఉండగా గత మూడు రోజుల్లోనే 4090.5 మి.మీ.కురిసింది.

జిల్లాలో నెలల వారీగా కురిసిన వర్షం(మి.మీ.)

నెల సాధారణ కురిసింది వ్యత్యాసం (శాతం)

జూన్‌ 117 87.4 –25.3 తక్కువ

జూలై 220.3 273.5 24.2 అధికం

ఆగస్టు 238.6 120.8 –49.4 తక్కువ

సెప్టెంబర్‌ 173.2 161.4 –6.8 సాధారణం

అక్టోబర్‌ 169.1 23.2 –86.3 తక్కువ

నవంబర్‌ 56.8 35.7 –37.2 తక్కువ

డిసెంబర్‌ 0.9 220.5 2,2711.8 అత్యధికం

రికార్డు స్ధాయిలో వర్షపాతం నమోదు

ఈనెలలో ఇంత వర్షం ఇదే ప్రథమం

తాళ్లపూడిలో గరిష్టంగా 288.4 మి.మీ.

జిల్లాలో ఒక్క రోజులో 166.9 మి.మీ.

రాజమహేంద్రవరంలో వర్షానికి జలమయంగా దేవీచౌక్‌– పేపర్‌మిల్లు రోడ్డు
1/4

రాజమహేంద్రవరంలో వర్షానికి జలమయంగా దేవీచౌక్‌– పేపర్‌మిల్లు రోడ్డు

శ్యామలా థియేటర్‌ రహదారిలో..
2/4

శ్యామలా థియేటర్‌ రహదారిలో..

అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో..
3/4

అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో..

రాజమహేంద్ర వరం కోటిపల్లి బస్టాండ్‌ వద్ద హోటల్‌ వైష్ణవి వీధిలో..
4/4

రాజమహేంద్ర వరం కోటిపల్లి బస్టాండ్‌ వద్ద హోటల్‌ వైష్ణవి వీధిలో..

Advertisement
Advertisement