నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

28 Mar, 2023 00:38 IST|Sakshi
స్పందనలో సమస్యలు వింటున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఏలూరు టౌన్‌: జిల్లాలో నేరగాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందనలో జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై ఎస్పీకి వినతులు, ఫిర్యాదులు సమర్పించారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఆయన సంబంధిత పోలీస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలు మరింత విజృంభించే ప్రమాదం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల వలలో పడవద్దని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే వాట్సప్‌ లింకులను ఓపెన్‌ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందని, ఆమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థల నుంచి బహుమతులు వచ్చాయంటూ మెస్సేజ్‌లు వస్తుంటాయని, వాటికి ప్రజలు స్పందించకూడదని కోరారు.

ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

మరిన్ని వార్తలు