ఈ నూనె రాస్తే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది

25 Nov, 2023 11:30 IST|Sakshi

సమస్యలు తగ్గించే ఆమ్లా ఆయిల్‌
మూడు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనెను వేడిచేయాలి. నూనె చక్కగా వేడెక్కిన తరువాత రెండు టేబుల్‌ స్పూన్ల ఉసిరిపొడి వేసి కలపాలి. సన్నని మంటమీద మరో ఐదు నిమిషాలు మరగనిచ్చి దించేయాలి. నూనె చల్లారాక గాజుసీసాలో వేసి నిల్వచేసుకోవాలి. రాత్రి పడుకునేముందు ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి మర్దన చేసుకోవాలి. వారంలో కనీసం నాలుగుసార్లు ఈ నూనెతో మర్దన చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుముఖం పట్టి ఒత్తుగా పెరుగుతుంది. 

మృదువుగా మార్చే క్రీమ్‌

టేబుల్‌ స్పూను పెట్రోలియం జెల్లీలో టేబుల్‌ స్పూను కొబ్బరి నూనె వేసి, టేబుల్‌ స్పూను గ్లిజరిన్, ఐదారు చుక్కల నిమ్మరసం వేసి క్రీమ్‌లా మారేంతవరకు బాగా కలపాలి. తరువాత ఈ క్రీమ్‌ను పగిలిన పాదాలకు రాసి మర్దన చేయాలి. రోజుకు రెండుసార్లు ఈ క్రీమ్‌ను అరికాళ్లకు రాస్తే పగుళ్లు తగ్గి పాదాలు కోమలంగా, మృదువుగా మారతాయి.  

మరిన్ని వార్తలు