రవితేజ ఈగల్‌ కౌంట్‌డౌన్‌ ‍స్టార్ట్‌.. వేట మొదలైంది

25 Nov, 2023 08:36 IST|Sakshi

మాస్‌ మహారాజ రవితేజ 'ఈగల్‌'గా సంక్రాంతి రేసులో దిగుతున్నాడు. ఈ భారీ యాక్షన్‌ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌లు కనిపించనున్నారు.  ఈ సినిమా థియేట్రికల్ రాకకు కౌంట్‌డౌన్ మొదలైందని మేకర్స్‌ తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.

సంక్రాంతి అంటే తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ.. ఈ ఆనంద సమయంలో కుటుంబం మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకుంటుంది. అందుకే ఇండస్ట్రీలో చాలా సినిమాలు సంక్రాంతిని టార్గెట్‌ చేసుకుని వస్తాయి. రవితేజ ఈగల్‌ కూడా జనవరి 13న విడుదల కానుంది. మరో 50 రోజుల్లో ఈగల్‌ వచ్చేస్తుందని కౌంట్‌డౌన్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. అందులో రవితేజ డెస్క్‌పై చాలా ఆయుధాలతో కనిపించారు. 

రవితేజ కెరియర్‌లోనే ఇదొక వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథగా రూపొందుతోందని గతంలో మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో  రవితేజ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ మంచి బజ్‌ను క్రియేట్‌ చేసింది. ఈగల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.

మరిన్ని వార్తలు