హీరోయిన్‌పై డైరెక్టర్‌ లైంగిక వేధింపులు.. నిలిచిన విజయ్ సేతుపతి సినిమా

25 Nov, 2023 07:47 IST|Sakshi

కోలీవుడ్‌లో నటి త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు కొద్దిరోజులుగా సౌత్‌ ఇండియాలో పెద్ద చర్చాంశంగా మారింది.  త్రిషకు మన్సూర్‌ సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడింది.  తమిళ చిత్రసీమలో ఇలాంటి ఘటనలు చాలా సార్లు జరిగాయని.. ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా పలువురు హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురికావడం జరిగిందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. హీరోయిన్‌ మనీషాపై సుమారు 9 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పుడు తెరపైకి వచ్చింది

మనీషా యాదవ్‌పై లైంగిక వేధింపులు
శీను రామసామి దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన 'ఉదామ విధ ఏవల్' చిత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే, కొడైకెనాల్‌లో సినిమా షూటింగ్‌లో నటి మనీషా యాదవ్‌ను శీను రామసామి లైంగికంగా వేధించాడని జర్నలిస్ట్ బిస్మీ భకీర్ తాజాగా ఆరోపించారు. ఈ సందర్భంలో మనీషా యాదవ్ దీనిపై ఓ పోస్ట్ పెట్టి మరోసారి వైరల్‌గా మారింది.

శీను రామస్వామి షేర్‌ చేసిన వీడియో: మనీషా యాదవ్ తన వల్లనే సినిమా నుంచి తప్పుకున్నారా..? అంటూ ఒక  వీడియో షేర్‌ చేశారు. అందులో  శీను రామస్వామి కృతజ్ఞతలు చెబుతూ మనీషా యాదవ్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆ పోస్ట్‌పై మనీషా యాదవ్ స్పందించింది. 2010లో విజయ్‌ సేతుపతితో శీను రామస్వామి తీసిన మరోచిత్రం 'తెన్మెర్కు పరువాకత్రు'. ఈ సినిమాకు నేషనల్‌ అవార్డు దక్కింది. విజయ్‌కు స్పెషల్‌ జ్యూరీ అవార్డు దక్కింది.

నేను ఏదీ ఎప్పటికీ మరచిపోలేను
శీను రామస్వామి వీడీయోకు కౌంటర్‌గా మనీషా కూడా ఒక పోస్ట్‌ పెట్టింది. 'ఒక చెత్త కథ ఆడియో ఆవిష్కరణలో అందరికీ కృతజ్ఞతలు తెలిపినట్లే శీను రామస్వామికి కూడా నేను కృతజ్ఞతలు తెలిపాను. లేదంటే 9 ఏళ్ల క్రితం నేను అతని గురించి చెప్పిన దానికి ప్రత్యామ్నాయం లేదని, తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తితో ఎప్పటికీ పని చేయను.' మనీషా యాదవ్ చెప్పింది. అప్పట్లో అతనిపై ఆమె చేసిన ఆరోపణల వల్లే అప్పట్లో ఆ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. 9 ఏళ్లు అయినా ఆ చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 

మరిన్ని వార్తలు