సంగీతంతో ఒత్తిడి, డిప్రెషన్‌ దూరం.. అధ్యయనాల్లో వెల్లడి

15 Nov, 2023 12:26 IST|Sakshi

పాటకు రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందంటారు. అంతేకాదు.. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఎలాంటి మత్తు ఇంజెక్షన్‌ ఇవ్వకుండా కేవలం మ్యూజిక్‌ వింటూనే చేయించుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎలాంటి వ్యాధినైనా సంగీతం నయం చేస్తుందనే విషయం ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. కొన్ని క్లిష్టమైన రోగాలను సైతం నయం చేయగలిగే సత్తా సంగీతానికి ఉంటుంది. మరి సంగీతం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా..

సంగీతం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? మనసు బాగోకపోయినా, సంతోషంగా ఉన్నా, జర్నీలో ఉన్నా.. ఇలా ఏ సందర్భంలో అయినా పాటలు వింటూ ఉంటే చెప్పలేని సంతోషం.ఎలాంటి వ్యాధినైనా సంగీతం నయం చేస్తుందనే విషయం ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన ఇదే విషయాన్ని వెల్లడి చేస్తోంది. రెండు రూములను ఎంచుకొని, ఒకే విధమైన విత్తనాలను వాటిలో పెంచడం మొదలుపెట్టారు. వీటిలో ఒక రూములో శాసీ్త్రయ సంగీతం అదనంగా ఏర్పాటు చేశారు. అనూహ్యంగా ఈ మొక్కల ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉన్నట్లు పరిశోధన ఫలితం వెల్లడైంది.

గుండె పనితీరు సక్రమంగా ఉండేందుకు సంగీతం కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

► ప్రతిరోజు ఒక అరగంటపాటు ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల గుండె పనితీరు పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు సంగీతం వింటూ తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల శరీరంలో గుండెకు మేలు కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

► డిప్రెషన్, యాంగ్జయిటీ, పెయిన్, స్ట్రెస్ మొదలైన సమస్యలకు ఇప్పుడు సంగీతం కూడా చికిత్సగా ఉపయోగపడుతోంది. సంగీతం వినడం వల్ల విద్యార్థులు మరియు ఉద్యోగులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
► సంగీతం వినడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. 
► మనకు నచ్చిన సంగీతం వింటే శరీరంలో హ్యాపీహార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని పూర్తి స్ధాయిలో పోగొడతాయి.
► సంగీతం వినడం వల్ల మతిమరుపు సమస్య కూడా దూరమవుతుంది. దీనికారణంగా అల్జీమర్స్ వంటి సమస్యలు చాలా వరకూ దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మ్యూజిక్ థెరపీ అనేది చాలా మంది మతిమరుపు సమస్యల్ని దూరం చేశాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నారు.
► ప్రతిరోజూ సంగీతం వినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

మరిన్ని వార్తలు