పార్టీకి వెళుతున్నారా? ఈ ఫేస్‌ప్యాక్‌తో ఇన్‌స్టంట్‌ గ్లో

15 Nov, 2023 10:51 IST|Sakshi

ఇన్‌స్టంట్‌ గ్లో ప్యాక్‌

ఎంత మంచి డ్రెస్, దానికి తగ్గ యాక్సెసరీస్‌ ధరించినా, ముఖం ప్రకాశవంతంగా ఉంటేనే ఆకర్షణీయంగా ఉంటుంది. క్షణాల్లో మెరుపులీనేలా కనిపించే ఇన్‌స్టంట్‌ గ్లో ప్యాక్‌ను ప్రయత్నించి చక్కగా మెరిసిపోండి.

రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, రెండు టేబుల్‌ స్పూన్ల చల్లటి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేయాలి. ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాసుకుంటే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు