అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..

29 Oct, 2021 18:20 IST|Sakshi

గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడాన్నికార్డియాక్ అరెస్ట్ అంటారు. నిజానికి ఇది ఒక రకంగా ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. అమెరికాలో సగానికిపైగా జనాభా దీని భారీన పడుతున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి. ఐతే దీని బారిన పడ్డవెంటనే చికిత్స అందిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు, ఎవరెవరు దీని బారినపడతారో, చికిత్స ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకుందాం..

కార్డియాక్ అరెస్ట్‌కు కారణాలు
►వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్
గుండెలో నాలుగు గదులు ఉంటాయి. దిగువ రెండు గదులను జఠరికలు, పై రెండు గదులను కర్ణికలు అంటారు. కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్తప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది కూడా. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగానే కార్డియాక్ అరెస్ట్‌ సంభవిస్తుంది.

►కర్ణిక దడ
ఎగువ గదుల్లో (కర్ణిక)ని అరిథ్మియా వల్ల కూడా గుండె  కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్ నోడ్ సరైన విద్యుత్ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ ప్రారంభమవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి సమర్ధవంతంగా రక్తాన్ని పంపవు.

కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎవరికి ఉంది?
►కరోనరీ హార్ట్ డిసీజ్‌తో బాధపడే వారిలో ఈ సమస్య సాధారణంగా తలెత్తుతుంది.
►గుండె పరిమాణం పెద్దదిగా ఉ‍న్నవారిలోకూడా హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 
►పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్న పిల్లల్లో కూడా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చు.
►గుండె విద్యుత్ వ్యవస్థతో సమస్యలు తలెత్తినా ఆకస్మిక మరణం సంభవిస్తుంది. 

ఈ కింది కారణాల వల్ల కూడా సంభవించవచ్చు..
►ధూమపానం
►ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి 
►అధిక రక్త పోటు
►ఊబకాయం
►వంశపారంపర్య గుండె జబ్బులు
►45 కంటే ఎక్కువ వయస్సున్న పురుషులకు, 55 కంటే ఎక్కువ వయసున్న మహిళలకు 
►పొటాషియం/మెగ్నీషియం స్థాయిలు తక్కువ ఉ‍న్నవారిలో

కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు
►తలతిరుగుతుంది
►అలసటగా అనిపించడం
►వాంతి
►గుండెల్లో దడ 
►ఛాతి నొప్పి
►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
►స్పృహ కోల్పోవడం

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణం నిలుపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనే పరీక్ష చేసి, సత్వర చికిత్స అందించడం ద్వారా శరీరానికి రక్తం ప్రసరించేలా ప్రేరేపిస్తారు. ఫలితంగా  కార్డియాక్‌ అరెస్ట్‌ నుంచి బయటపడవచ్చు.

చదవండి: మత్స్యకారులకు దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద..

మరిన్ని వార్తలు