చల్లటి చలిలో కారం కారంగా కరకరలాడే పొటాటో పాన్‌కేక్స్‌ చేయండిలా!

3 Nov, 2023 10:15 IST|Sakshi

చలి కొరుకుడుని తట్టుకోవాలంటే నోటికి కాస్త వేడివేడి రుచులు తగలాల్సిందే. వేడితోపాటు కారం, కరకర లాడే కమ్మదనం తోడయితే చలిని కూడా కొరికేయవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు.  

కావలసిన పదార్థాలు:
ఉడికించి చిదుముకున్న బంగాళ దుంపలు – రెండు కప్పులు
గుడ్డు – ఒకటి
మైదా – ముప్పావు కప్పు
స్ప్రింగ్‌ ఆనియన్‌ తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
 చీజ్‌ తరుగు – కప్పు;
క్యారట్‌ తురుము – అరకప్పు
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – రెండు టీస్పూన్లు
నూనె – అరకప్పు
పుల్లటి పెరుగు – గార్నిష్‌కు సరిపడా

తయారీ విధానం: గిన్నెలో చిదిమిన దుంపల మిశ్రమం, గుడ్డుసొన, మైదా, స్ప్రింగ్‌ ఆనియన్, చీజ్‌ తరుగు, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ఈ మిశ్రమం చేతులకు అంటుకుంటున్నట్లు అయితే మరో టేబుల్‌ స్పూను మైదా వేసి కలపాలి. పిండి ముద్దను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.ఇరవై నిమిషాల తరువాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసి పాన్‌కేక్‌లా వత్తుకోవాలి ∙బాణలిలో నూనె వేయాలి. బాగా కాగిన∙నూనెలో ఒక్కో పాన్‌కేక్‌ను వేసి మీడియం మంట మీద కాల్చాలి. క్రిస్పీగా బ్రౌన్‌ కలర్‌లోకి మారాక పాన్‌కేక్‌లను తీసేయాలి. పాన్‌కేక్‌పైన కొద్దిగా పుల్లటి పెరుగువేసి సర్వ్‌ చేసుకోవాలి. 

(చదవండి: దేవి నవరాత్రుల్లో వెరైటీగా దెహరోరి స్వీట్‌ ట్రై చేయండి!)

మరిన్ని వార్తలు