-
ఆలూ కేక్.. ఎప్పుడైనా ట్రై చేశారా..!
కావలసినవి: గోధుమ పిండి ఆలూ గుజ్జు – 1 కప్పు చొప్పున బాదం పౌడర్, జొన్న పిండి – పావు కప్పు చొప్పున పాలు – ముప్పావు కప్పు (కాచి చల్లార్చినవి) నూనె లేదా బటర్ – పావు కప్పు (బటర్ అయితే కరిగించుకోవాలి) గడ్డ పెరుగు, వాల్ నట్స్ తరుగు, చాక్లెట్ చిప్స్ – పావు కప్పు చొప్పున బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ తయారీ విధానం: ముందుగా గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఒక బౌల్లో జల్లించుకోవాలి. మరో బౌల్ తీసుకుని అందులో ఆలూ గుజ్జు, బాదం పౌడర్, జొన్నపిండి వేసుకుని, అర కప్పు పాలు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో నూనె లేదా బటర్, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిగిలిన పావు కప్పు పాలనూ పోసేసుకుని మరోసారి పేస్ట్‌లా కలుపుకుని.. వాల్ నట్స్ ముక్కలు, చాక్లెట్ చిప్స్ వేసుకుని.. ఆ మిశ్రమాన్ని బేకింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దాన్ని ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకుని నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: సలాడ్స్ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్ డివైస్‌తో క్లియర్..! -
Potato Peel ‘తొక్క’ లే అనుకుంటే పప్పులో కాలేసినట్టే!
#Potato Peel : చిన్నపుడు అమ్మమ్మ బీర కాయ పొట్టు పచ్చడి చేసి. ఇది ఏం పచ్చడో చెప్పండర్రా.. అంటూ పెద్ద పజిల్ వేయడం గుర్తుందా? నిజంగా అమోఘమైన ఆ రుచికి, అసలు అది ఏం పచ్చడో అర్థం కాక.. తీరా గుట్టు విప్పాక, ‘బీర్’ కాయా అంటూ నోరు వెళ్లబెట్టడం కూడా తెలుసు. అలాగే సొరకాయ తొక్కులు, పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి, ఆఖరికి పుచ్చకాయల తొక్క లోపల ఉండే తెల్లటి పదార్థంతో కూడా దోసెలు చేసి పెట్టడం కూడా తెలుసు. ఇపుడు అలాంటి తొక్కలు మరొక దాని గురించే తెలిస్తే.. నిజంగా ఔరా అంటారు.. అదిఏమిటంటే.. చిన్న పిల్లలకు ఆలూ ఫ్రై చేసి పెడితే చాలు..మారు మాట్లాడకుండా లాగించేస్తారు. పెద్దలకి కూడీ ఆలూ లేదా బంగాళా దుంప అంత ఫ్యావరేట్. కానీ ఆలూ తొక్కల వాడకం, ప్రయోజనాల గురించి మాత్రం చాలామంది తెలియదు. బంగాళాదుంపల తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కలను చర్మ, సౌందర్య సాధానాల్లో వినియోగిస్తారు. కాలిన గాయాలకు చికిత్స ఆలుగడ్డ తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది. ఇది చిన్నపాటి కాలిన గాయాలకు చికిత్సగా ఉపయోపడుతుంది. అంతేకాదు వేసవిలో ఎండలకు కమిలిని చర్మానికి సహజమైన చిట్కాగా పని చేస్తుంది. సిల్కీ స్కిన్ మొటిమలతో ఎక్కువగా బాధపడుతున్నవారు ఆలూ తొక్కలను అప్లై చేసుకోవచ్చు.మొటిమల్ని గిల్లకుండా, ఎక్కువ రుద్దకుండా వాటిపై తొక్కలతో మెల్లిగా రాయాలి. అలాగే కళ్లకిందే ఉండే డార్క్ సర్కిల్స్ నివారణలో కూడా ఫలితాలు అందిస్తుంది. కెమికల్స్ లేని సహజమైన ఈ తొక్కల రసాన్ని చర్మానికి అప్పై చేయవచ్చు. ఈ జ్యూస్‌తో సిల్కీగా, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అందుకే వీటిని ఎప్పటినుంచో సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఐరన్ పాత్రల తుప్పు పట్టకుండా, స్టార్చ్ సహజమైన గ్రీజుగా పనిచేస్తుంది. అలా వంట ఇంటి చిట్కాగా పనిచేస్తుంది. ఆలూ తొక్కలు మొక్కలకు ఎంతో బలం మొక్కలకు కూడా ఇవి మంచి బాలన్నిస్తాయి. భాస్వరం, పొటాషియం, నత్రజని వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ తొక్కలు నేల నాణ్యతను మెరుగుపరుస్తాయి. మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది. ఆలూ తొక్కల పీల్ కంపోస్ట్ వేసిన వెంటనే గులాబీ, మల్లె లాంటి పూల మొక్కలు వెంటనే మొగ్గ తొడుగుతాయి. -
నో ఫ్యాట్, నో షుగర్.. మార్కెట్లోకి ‘నీలకంఠ’ ఆలూ!
మనం పలు రకాల బంగాళ దుంపలను(ఆలూ) చూసేవుంటాం. అయితే ఇప్పుడు తాజాగా నీలకంఠ ఆలూను మార్కెట్లోకి విడుదల చేశారు. పేరుకు తగినట్టుగానే ఇది నీలి రంగు బంగాళాదుంప. షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా దీనిని తినొచ్చని చెబుతున్నారు. ఈ నీలకంఠ బంగాళాదుంప రకాన్ని బీహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రోహ్తాస్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ అభివృద్ధి చేసింది. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బంగాళదుంపలో అనేక సుగుణాలు ఉన్నాయని రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రతన్ కుమార్ తెలిపారు. దీనిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పైగా ఈ నీలకంఠ ఆలూలో చక్కెర చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తెల్ల బంగాళదుంపల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ పేషెంట్లు తెల్ల బంగాళాదుంపలను తినవద్దని వైద్యులు సూచిస్తుంటారు. ఎవరైనా నీలకంఠ బంగాళాదుంపలను సాగు చేయాలనుకుంటే రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నుంచి విత్తనాలను ఆర్డర్ చేయవచ్చు. ఇతర విత్తనాలతో పోలిస్తే దీని విత్తనాలు కొంచెం ఖరీదైనవి. ఈ బంగాళదుంప వైరస్ రహితమని, ఈ బంగాళాదుంప మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
చల్లటి చలిలో కారం కారంగా కరకరలాడే పొటాటో పాన్‌కేక్స్ చేయండిలా!
చలి కొరుకుడుని తట్టుకోవాలంటే నోటికి కాస్త వేడివేడి రుచులు తగలాల్సిందే. వేడితోపాటు కారం, కరకర లాడే కమ్మదనం తోడయితే చలిని కూడా కొరికేయవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు. కావలసిన పదార్థాలు: ఉడికించి చిదుముకున్న బంగాళ దుంపలు – రెండు కప్పులు గుడ్డు – ఒకటి మైదా – ముప్పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు చీజ్ తరుగు – కప్పు; క్యారట్ తురుము – అరకప్పు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – రెండు టీస్పూన్లు నూనె – అరకప్పు పుల్లటి పెరుగు – గార్నిష్‌కు సరిపడా తయారీ విధానం: గిన్నెలో చిదిమిన దుంపల మిశ్రమం, గుడ్డుసొన, మైదా, స్ప్రింగ్ ఆనియన్, చీజ్ తరుగు, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ఈ మిశ్రమం చేతులకు అంటుకుంటున్నట్లు అయితే మరో టేబుల్ స్పూను మైదా వేసి కలపాలి. పిండి ముద్దను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.ఇరవై నిమిషాల తరువాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసి పాన్‌కేక్‌లా వత్తుకోవాలి ∙బాణలిలో నూనె వేయాలి. బాగా కాగిన∙నూనెలో ఒక్కో పాన్‌కేక్‌ను వేసి మీడియం మంట మీద కాల్చాలి. క్రిస్పీగా బ్రౌన్ కలర్లోకి మారాక పాన్కేక్లను తీసేయాలి. పాన్కేక్పైన కొద్దిగా పుల్లటి పెరుగువేసి సర్వ్ చేసుకోవాలి. (చదవండి: దేవి నవరాత్రుల్లో వెరైటీగా దెహరోరి స్వీట్ ట్రై చేయండి!) -
చిలకడదుంపతో కేక్, ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ బావుంటుంది
వాల్నట్ – స్వీట్‌పొటాటో కేక్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప›– 1(పెద్దది, సుమారు 450గ్రాములు ఉండాలి.) వాల్నట్ – 100 గ్రాములు,పంచదార – 200 గ్రాములు బ్రౌన్ షుగర్ – 50గ్రాములు, వెజిటబుల్ నూనె – 120 మిల్లీలీటర్లు నీళ్లు – 80 మిల్లీలీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత మైదాపిండి – 220 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్,జాజికాయ పొడి – పావు టీ స్పూన్ తయారీ విధానమిలా: చిలగడ దుంపను సిల్వర్ పేపర్లో చుట్టి.. ఓవెన్లో బాగా బేక్ చేసుకుని.. చల్లారిన తర్వాత.. మెత్తగా చిదుముకోవాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని.. అందులో గుడ్లు, పంచదార, బ్రౌన్ షుగర్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత నూనె, నీళ్లు పోసుకుని మరోసారి హ్యాండ్ బ్లెండర్తో బాగా కలుపుకోవాలి. ఇంతలో మరో బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, జాజికాయ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ మిశ్రమంలో మైదా మిశ్రమం కలిపి.. హ్యాండ్ బ్లెండర్తో మరోసారి కలపాలి. దానిలో చిలగడదుంప గుజ్జుని వేసుకుని.. బాగా కలిపి.. నచ్చిన షేప్‌లోని బేకింగ్ బౌల్ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం మొత్తం పోసుకుని.. సమాంతరంగా పరచి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అనంతరం చాక్లెట్ బిట్స్, క్రీమ్స్‌తో నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement