ఆ గుహలోకి వెళ్తే ..ఆత్మలను లైవ్‌లో చూడొచ్చట!

17 Dec, 2023 16:33 IST|Sakshi

ఆత్మల గురించి కథలు కథలుగా వినడం లేదా సినిమాల్లో చూడటమే. గాన్నీ ప్రత్యక్షం చూసిన అనుభవం ఎవరికీ ఉండదు. మహా అయితే దేన్నో చూసి ఊహించుకుని భయపటమే జరగుతుంది. ఈ గుహలోకి వెళ్తే ఆ కోరక తీరిపోతుందట. ఏంటీ..? అని నోరెళ్లబెట్టకండి. నిజంగా ఆత్మలను ప్రత్యక్ష్యంగా చూడాలనుకునేవాళ్లు నేరుగా ఈ గుహలోకి వెళ్లిపోతే ఆ ఫీలింగ్‌ దక్కుతుందట. పైగా ఆ అనుభవాన్ని అంత తేలిగ్గా మరిచిపోలేరట కూడా. ఆ గుహ ఎకడుందంటే..?

ఇదేదో మామూలు కొండగుహ కాదు, దయ్యాల నిలయం. ఫిన్లండ్‌లోని కోలి అభయారణ్య ప్రాంతంలో ఉన్న ఈ గుహను స్థానిక ఫిన్నిష్‌ భాషలో ‘పిరున్‌కిర్కో’ అంటారు. అంటే, దయ్యాల ఆలయం అని అర్థం. ప్రేతాత్మల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక పర్యాటకులు అడపాదడపా ఇక్కడకు వచ్చి, ఈ గుహలో కాసేపు గడిపి వెళుతుంటారు. ఈ గుహలోకి అడుగుపెట్టిన తర్వాత గుహలో ఏదో ఆత్మ సంచరిస్తున్న అనుభూతి కలిగినట్లు ఇందులోకి వెళ్లి వచ్చిన చాలామంది చెప్పారు.

ఇందులోకి అడుగు పెట్టగానే ఎవరో అదృశ్యంగా తాకుతున్న అనుభూతి కలిగిందని, చెవిలో ఎవరో గుసగుసలు చెబుతున్నట్లుగా అనిపించిందని పలువురు చెప్పారు. గుహలో ఎవరో రోదిస్తున్న ధ్వని వినిపించినట్లుగా కూడా కొందరు చెప్పారు. ఈ గుహ లోపలి పొడవు 34 మీటర్లు ఉంటుంది. అంతా ఖాళీగా, చీకటిగా ఉంటుంది. ఈ గుహలోని ఆత్మ గురించి ఫిన్లండ్‌లో చాలా కథలు శతాబ్దాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఇందులోకి వెళ్లేవారికి అక్కడ ఏదో ఆత్మ సంచరిస్తున్న అనుభూతి ఎందుకు కలుగుతోందనే దానిపై నిగ్గు తేల్చేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఫిన్లండ్‌ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధనలు ప్రారంభించారు. 

(చదవండి: ఆ ఫౌంటెన్‌ కోసం ఏకంగా రూ. 16 కోట్లు ..! కానీ చివరికి..)

>
మరిన్ని వార్తలు