తాజ్‌మహల్‌ నిర్మాణానికి పుల్లలెత్తింది ఈయనే..

19 Mar, 2021 08:05 IST|Sakshi

ఇంగ్లాండ్‌లోని షెఫ్‌ఫిల్డ్‌ నగరానికి చెందిన 87 సంవత్సరాల డెరిక్‌కు ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల నమూనాలను పుల్లలతో తయారు చేయడం అనేది హాబీ. ఒక మోడల్‌ను పూర్తి చేయడానికి పది నుంచి పన్నెండు నెలల సమయం పడుతుంది. వీటికోసం ఇంట్లో ప్రత్యేకంగా షెల్ఫ్‌లను కూడా నిర్మించాడు.

‘ఈ మోడల్స్‌ అందంగా రావాలంటే క్రియేటివిటీ కంటే ఓపిక ఉండడం చాలా ముఖ్యం’ అంటాడు డెరిక్‌. ‘మరి ఈ వయసులో మీరు ఇంత ఓపిక...’ అని ఎవరైనా అడగబోతే శేషజీవితంలో తన జీవనోత్సాహానికి ఈ హాబీనే కారణం అంటాడు. మన తాజ్‌మహల్‌ తయారు చేయడానికి చాలా టైమ్‌ పట్టిందట. ‘ఇదొక పెద్ద ఛాలెంజ్‌’ అంటాడు డెరిక్‌. తెలిసిన విద్య ఊరకేపోవడం ఎందుకని పిల్లలకు కూడా నేర్పిస్తున్నాడు.
చదవండి: ఫేస్‌బుక్‌లో ఆ రికమెన్‌డేషన్‌లుండవు...!

మరిన్ని వార్తలు