Reverses Aging Cocktail Discovered: ఈ కాక్‌టెయిల్‌ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..

16 Jul, 2023 14:01 IST|Sakshi

వృద్ధాప్యం! ఆ వయసులో ఎదుర్కొనే సమస్యలు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలామంది ఆ వయసు సమీపించే సమయంలో కూడా ఫిట్‌గా యవ్వనంగా ఉండాలనే రకరకాల డైట్‌ ఫాలో అవుతుంటారు. అయినా ఏదో ఒకరకంగా మనలో ఆ వృద్ధాప్య ఛాయాలు కనిపిస్తునే ఉంటాయి. ఐతే దానికి చెక్‌పెట్టి మనం ఎప్పటికీ యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు అని చెబుతున్నారు.

ఈ మేరకు శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. హర్వర్డ్‌ శాస్త్రవేత్తల బృందం వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ఓ సరికొత్త రసాయన కాక్‌టెయిల్‌ని కనిపెట్టింది. వారంతా ఈ కాక్‌టెయిల్‌ని మానవులు, ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలనిచ్చింది. వారి ఏజ్‌ని చాలా ఏళ్లు వెనక్కి నెట్టినట్లు నిర్థారించారు. తాము ఈ పరిశోధనలను "రసాయన ప్రేరిత రీ ప్రోగ్రామింగ్‌ టు రివర్స్‌ సెల్యులర్‌ ఏజింగ్‌" అనే పేరుతో చేసినట్లు తెలిపారు ఈ మేరకు హార్వర్డ్‌ పరిశోధకుడు డేవిడ్‌ సింక్లైర్‌ జూలె12న ప్రచురితమైన జర్నల్ ఏజింగ్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. "జన్యు చికిత్స ద్వారా రివర్సల్‌ ఏజింగ్‌ సాధ్యమవుతుందని భావించాం. ఇప్పుడూ ఈ కెమికల్‌ కాక్‌టెయిల్స్‌తో అది సాధ్యమని చూపించాం. ఇది నిజంగా మనిషిని పూర్తి యవ్వనవంతుడిగా మార్చే ఒక ముందడగు అని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.

ఈ రసాయన కాక్‌టెయిల్‌లో ఐదు నుంచి ఏడు ఏజెంట్లు ఉంటాయని, వీటిలో చాలా వరకు శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స అందిస్తాయని చెప్పారు. తమ బృందం సెల్యూలర్‌ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా మానవ కణాలను పునర్‌జ్జీవింప చేయడానికి మిళితం చేయగల అణువులను కనుగొనడానికి మూడు ఏళ్లు పైగా కృషి చేశారు. ఈ పరిశోధనల్లో.. ఆప్టిక్‌ నరాలు, మెదడు, కణజాలం, మూత్రపిండాలు, కండారాలు తదితరాలపై అధ్యయనాలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని తెలిపారు.

ఎలుకలపై చేసిన పరిశోధనల్లో..వాటి జీవితకాలం పొడిగించబడటమేగాక మంచి ఫలితాలు కనిపించాయన్నారు. అలాగే కోతులపై చేసిన పరిశోధనల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇక మిగిలింది మానవులపై చేయాల్సిన పూర్తి స్తాయి క్లినికల్‌ ట్రయల్స్‌ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో అవి కూడా ప్రారంభకానున్నాయని చెప్పారు.  అంతా సవ్యంగానే జరగుతుందని, మంచి ఫలితాలే వస్తాయని ధీమగా చెబతున్నారు హార్వర్డ్‌ శాస్త్రవేత్త సింక్లైర్‌.

(చదవండి: ఇది చినుకు కాలం.. జనం వణుకు కాలం.. 3-4 వారాలు బాధించే జ్వరంతో జాగ్రత్త!)

మరిన్ని వార్తలు