చర్మ కాంతిని మరింత పెంచే మసాజ్‌ స్క్రాపర్‌.. ధర ఎంతంటే..

31 Oct, 2021 12:10 IST|Sakshi

చర్మ సంరక్షణకు మించిన సౌందర్య రహస్యం మరోకటి లేదు. దానికి అద్భుతమైన టూల్‌  ఈ మసాజ్‌ స్క్రాపర్‌.  హై క్వాలిటీ ఆక్రిలోనిట్రైల్‌ బుటాడిన్‌ స్టెరిన్‌ – స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ మెటీరియల్‌తో రూపొందిందీ మినీ డివైజ్‌. దీని నుంచి విడుదలయ్యే 45 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌.. స్కిన్‌ కేర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వైబ్రేషన్స్‌.. చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, కాంతిమంతం చేయడానికి తోడ్పడతాయి. అంతేకాదు ఇది ఒత్తిడిని దూరం చేసి.. ప్రశాంతతను అందిస్తుంది. అదనపు కొవ్వును తగ్గిస్తుంది. 

ఈ స్క్రాపింగ్‌ మసాజ్‌ టూల్‌.. చర్మంపైన ఆక్యుపాయింట్స్‌ని ప్రేరేపించేలా త్రికోణ ఆకారంలో ఉంటుంది. దీనిలో స్మూతింగ్‌ మోడ్, యాక్టివేటింగ్‌ మోడ్‌ అనే రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. స్మూతింగ్‌ మోడ్‌.. లో–వైబ్రేషన్‌ అందిస్తే,  యాక్టివేటింగ్‌ మోడ్‌.. హైయర్‌–వైబ్రేషన్‌ను అందిస్తుంది. దాంతో కొన్ని నిమిషాల్లోనే చర్మం తేజోవంతమవుతుంది. ఇక్కడున్న చిత్రాన్ని గమనించినట్లైతే.. కింద ఉన్న చార్జింగ్‌ బేస్‌కి వెనుక భాగంలో యు.ఎస్‌.బి పోర్ట్‌ ఉంటుంది. దాంతో ఈ డివైజ్‌ని చార్జింగ్‌ బేస్‌లో అమర్చి.. యు.ఎస్‌.బి పోర్ట్‌కి చార్జర్‌ పెట్టుకుంటే.. వైర్‌లెస్‌ మసాజర్‌గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని మరోసారి ఉపయోగిస్తున్నప్పుడు.. చివరిగా ఏ మోడ్‌తో ఆఫ్‌ అయ్యిందో అదే మోడ్‌తో పని చేస్తుంది. ఈ ట్రయాంగిల్‌ టూల్‌ వాటర్‌ ప్రూఫ్‌ కావడంతో నీటితో శుభ్రం చేసుకోవచ్చు. దీని ధర 159 డాలర్లు. అంటే సుమారు 12 వేల రూపాయలు.

చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న తుపాకి.. లక్షల్లో ధర!

మరిన్ని వార్తలు