మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు

30 Jun, 2023 10:37 IST|Sakshi

మసాలా మజ్జిగకి కావలసినవి :
పెరుగు – ఒకటిన్నర కప్పులు
 జీలకర్ర పొడి – అరటీస్పూను
 పుదీనా తరుగు – టేబుల్‌ స్పూను
 బ్లాక్‌ రాక్‌సాల్ట్‌ – అరటీస్పూను
కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను
కరివేపాకు తరుగు – అరటీస్పూను
మునగాకు పొడి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు
దాల్చిన చెక్క పొడి – పావు టీస్పూను
చల్లని నీళ్లు – రెండు గ్లాసులు. 

తయారీ విధానం: ∙మిక్సీజార్‌లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మునగాకుపొడి, జీలకర్ర పొడి, రాక్‌సాల్ట్‌ వేసి గ్రైండ్‌ చేయాలి. ∙ఇవన్నీ నలిగిన తరువాత పెరుగు వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. ∙ఈ మిశ్రమంలో నీళ్లు పోసి కలుపుకుని, దాల్చినచెక్క పొడితో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. 

(చదవండి: నోరూరించే మునగ పువ్వుల ఫ్లవర్‌ ఫ్రై చేసుకోండి ఇలా..!)

మరిన్ని వార్తలు