Needle Free Injection: సూదిలేని ఇంజెక్షన్‌ వచ్చేసింది.. నొప్పి లేకుండా...

21 Nov, 2021 13:42 IST|Sakshi

నీడిల్‌ లెస్‌ ఇంజెక్షన్‌

ఇంజెక్షన్‌.. సైజు చిన్నదే అయిన పెద్ద వీరులని కూడా భయపెట్టగలదు. నర్సు సూది మొనను చూస్తూ.. గుచ్చడానికి సిద్ధం అవుతున్న సమయంలో చాలామంది భయంతో బిగుసుకుపోతుంటారు. ఇంజెక్షన్‌ వద్దు డాక్టర్‌.. మందులు ఇవ్వండి అని బతిమాలుతుంటారు. ఇప్పుడు ఆ అవసరం లేదు.

తాజాగా.. సూదిలేని ఇంజెక్షన్‌ వచ్చేసింది. పేరు ‘కొబి’. కెనడాకు చెందిన ఓ యూనివర్సిటీ బృందం తయారుచేసిన ఈ రోబో.. మూడు సెంటీమీటర్ల దూరం నుంచి అధిక ఒత్తిడితో మీ శరీరంలోకి మందును పంపిస్తుంది. ఇది కూడా మీ శరీరానికి రంధ్రం చేస్తుంది. కానీ, అది వెంట్రుక మందం మాత్రమే. కంటికి కనిపించదు, నొప్పి కూడా తెలియదు. ఇందులోని ఎల్‌ఐడీఏఆర్‌ సెన్సర్లు.. ఎక్కడ ఇంజెక్షన్‌ ఇవ్వాలో మ్యాప్‌ చేయడానికి, శరీరంలోని ఇతర ఇన్‌ఫెక్షన్లను గుర్తించడానికి ఉపయోగపడతాయి.

ముదున్న డిస్‌ప్లే స్క్రీన్‌పై ఇదంతా చూడొచ్చు. పైగా ఒకరికి వేసిన ఇంజెక్షన్‌ ఇంకొకరి వేస్తే, వచ్చే జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. బాగుంది కదూ! ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న ఈ రోబో త్వరలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. అప్పుడు ఇక చిన్నపిల్లలు సైతం ఇంజెక్షన్‌ వేయించుకోడానికి భయపడరు. 

చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!!

మరిన్ని వార్తలు