మొటిమలు పోగొట్టే రవీనా టండన్‌ చిట్కాలు..

19 Aug, 2020 19:58 IST|Sakshi

ముంబై: అందం మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప వరం. కానీ వివిధ కారణాలతో మొటిమలు రావడం వల్ల మొఖం అంద విహీనంగా తయారవుతుంది. యుక్త వయస్సుల్లో హర్మోన్ల అసమౌల్యత, ఒత్తిడి, పోషకాహార లోపం తదితర కారణాలతో మొటిమలు తరుచుగా వస్తుంటాయి. అయితే మొటిమలు నివారించడానికి ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. అయితే అదిరిపోయే అందంతో లక్షలాధి అభిమానులను సంపాధించుకున్న బాలీవుడ్ నటి రవీనా టండన్‌, మొటిమలు తగ్గడానికి కొన్ని చిట్కాలను సూచించారు. రవీనా టాండన్‌ సూచించే చిట్కాలివే
1) ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయని, కొబ్బరి నీళ్లు తాగాక చివరగా కొంచెం నీళ్లను మొఖానికి రాస్తే చర్మం చల్లబడి మొటిమలు నివారణకు తోడ్పడతాయని తెలిపింది.
2) మొఖం కాంతి వంతంగా మెరవాలంటే, రోజ్ వాటర్‌తో ముల్తానీ మట్టిని మొటిమలపై రాస్తే చర్మానికి రక్షణ వ్యవస్థగా పనిచేస్తు, మొటిమలు రాకుండా అడ్డుకుంటుందని పేర్కొంది.
3) చివరగా జీరాతో నిరంతరం మొఖాన్ని శుభ్రం చేసుకోవాలని, పేస్ట్‌లాగా ఉపయోగిస్తే ఆకర్శనీయ కాంతి వంతమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు.
చదవండి: వ‌చ్చే జ‌న్మ‌లో కూడా ఖాళీ లేదు

మరిన్ని వార్తలు