Ulava Garelu Recipe In Telugu: ఉలవ గారెలు తిన్నారా? ఇదిగో ఇలా చేసుకోండి!

7 Jun, 2022 16:54 IST|Sakshi

జిహ్వకు కొత్త రుచిని అందించే ఉలవ గారెల తయారీ ఇలా!

ఉలవ గారెల తయారీకి కావలసినవి:  
ఉలవలు – 2 కప్పులు
మినప్పప్పు – 1 కప్పు (నానబెట్టి, కడిగి, రెండూ కలిపి మిక్సీలో వేసి, మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి)
బియ్యప్పిండి – పావు కప్పు
బేకింగ్‌ సోడా – అర టీ స్పూన్‌
బొంబాయి రవ్వ, మొక్కజొన్న పిండి – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
నూనె – సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో ఉలవల పిండి, బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, మొక్కజొన్న పిండి, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి బాగా కలిపి గారెల పిండిలా గట్టిగా చేసుకోవాలి. 
స్టవ్‌ ఆన్‌ చేసుకుని, కళాయిలో నూనె పోసుకుని, వేడి కాగానే అందులో గారెలు వేసుకుని, దోరగా వేయించుకోవాలి. వీటిని సాంబార్‌లో లేదా పెరుగులో వేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. లేదంటే సాస్‌తో కానీ, కొత్తిమీర చట్నీతో కానీ తినొచ్చు. 

చదవండి: Butter Tea: సువాసన భరిత బటర్‌ టీ.. టింగ్మో, ఖమీరి రోటీ ఇంట్లోనే ఇలా ఈజీగా!

మరిన్ని వార్తలు