Amla Pickle Recipe In Telugu: ఊరించే ఉసిరితో స్పైసీగా పచ్చడి..సింపుల్‌గా ఇలా చేసుకోండి

17 Nov, 2023 14:40 IST|Sakshi

తిన్న తిండి ఒంటికి పట్టేలా చేయడంతో ఉసిరి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడం, క్యాన్సర్‌ ముప్పుని తగ్గించడంలో ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరి ప్రస్తుతం మార్కెట్లో దండిగా దొరుకుతోంది. అందుకే ఊరించే ఉసిరిని మరింత రుచిగా ఇలా చేసుకోమని చెబుతోంది ఈ వారం మన వంటిల్లు... 
 

స్పైసీ పచ్చడి తయారికి కావలసినవి:
ఉసిరికాయలు – ఆరు; పచ్చి శనగపప్పు – పావు కప్పు;
పచ్చిమిర్చి – మూడు; వెలుల్లి రెబ్బలు – నాలుగు;
ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; ఆవాలు – అర టీ స్పూను;
జీలకర్ర – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను;
ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – కాస్తంత

తయారీ విధానమిలా:
పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙ఉసిరికాయలను శుభ్రంగా కడిగి గింజలు తీసేసి ముక్కలుగా తరుగుకోవాలి. ∙ఉసిరికాయ ముక్కలు, నానిన శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి  అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్‌ చేయాలి.
గ్రైండ్‌ అయిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి ∙బాణలిలో నూనె వేసి, ఆవాలు జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ∙ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే స్పైసీ పచ్చడి రెడీ. చపాతీ, రోటీ, అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది. 

మరిన్ని వార్తలు