ఒకప్పుడు అది ఉప్పుగని! కానీ ఇప్పుడు..

22 Oct, 2023 16:30 IST|Sakshi

రుమేనియా క్లజ్‌ కౌంటీలోని టుర్డా నగరంలో ఉన్న భూగర్భ థీమ్‌పార్కు ఒకప్పుడు ఉప్పుగని. పురాతన రోమన్‌ సామ్రాజ్యంలో సహజమైన ఉప్పు నిక్షేపాలు ఉన్న ఈ చోట 1217లో ఉప్పును వెలికి తీసేందుకు గని తవ్వకాలు మొదలుపెట్టారు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఉప్పు గనుల్లో ఇదొకటి. శతాబ్దాల తరబడి ఇక్కడి నుంచి ఉప్పు సేకరించేవారు. ఇందులోని ఉప్పు నిల్వలు అంతరించిపోయాక చాలాకాలం ఖాళీగా మిగిలింది.

పాడుబడిన దశలో ఉన్న ఈ గనిలో 120 మీటర్ల లోతున 2010లో ఒక థీమ్‌పార్కును ఏర్పాటు చేశారు. జెయింట్‌ వీల్, ఫెర్రీవీల్, టేబుల్‌ టెన్నిస్, బిలియర్డ్స్‌ వంటి క్రీడా వినోదాల కోసం ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఈ భూగర్భ థీమ్‌పార్కు పర్యాటక ఆకర్షణగా మారింది. రుమేనియా స్థానికులతో పాటు ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన తొలి థీమ్‌పార్కు ఇదే కావడం విశేషం.

(చదవండి: తవ్వకాల్లో అరుదైన సమాధి..లోపల దృశ్యం చూసి కంగుతిన్న శాస్త్రవేత్తలు!)

మరిన్ని వార్తలు