Diabetes Risk With Salt: అన్ని గ్రాములకు మించి ఉప్పు వాడొద్దు.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు

3 Nov, 2023 11:21 IST|Sakshi

ఉప్పు ఎక్కువగా వాడితే రక్తపోటు(బీపీ)వస్తుందనే ఇప్పటి వరకు విన్నాం. కానీ ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని మీకు తెలుసా? లండన్‌కు చెందిన సైంటిస్టులు తాజాగా జరిపిన రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైంది. మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే మధుమేహం వస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. మరి రోజువారి మొత్తంలో ఎంత మేరకు ఉప్పు తీసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూసేద్దాం. 


ఉప్పు లేకుండా వంట చేయడం దాదాపు అసాధ్యం. ఏ వంట చేయాలన్నా ఉప్పు తప్పనిసరి. చాలామంది కూర చప్పగా ఉందనో, రుచి కోసమో మోతాదుకు మించి ఉప్పు వాడేస్తుంటారు. ఊరగాయ పచ్చళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోలెడంత ఉప్పు ఉంటుంది అందులో. అయితే ఇలా అవసరానికి మించి ఉప్పు తినడం వల్ల రక్తపోటు వస్తుందనే ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ తాజాగా ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని పరిశోధకులు తెలిపారు. అధిక ఉప్పు వాడటం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.

యూకేలోని 'తులనే' యూనివర్సిటీ నిర్వహించిన రీసెర్చ్‌లో ఈ షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. 12 ఏళ్ల పాటు 13 వేల మందిపై జరిపిన అధ్యయనంలో.. మోతాదుకు మించి ఉప్పు వాడే వారిలో టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే రిస్క్‌ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉప్పు తక్కువ తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా కొన్నిసార్లు తీసుకునే వ్యక్తుల్లో 13 శాతం, సాధారణంగా తీసుకునే వారిలో 20 శాతం, ఎల్లప్పుడూ తీసుకునే వారిలో 39 శాతం టైప్ 2 డయాబెటిస్ వచ్చినట్లుగా అధ్యయనంలో వెల్లడైంది.

ఉప్పు తక్కువగా తీసుకుంటే బీపీ మాత్రమే కాదు, మధుమేహం వచ్చే ఛాన్స్‌ కూడా తగ్గించుకోవచ్చని సైంటిస్టులు తెలిపారు. కొంతమంది ఆహారం తీసుకొనేటప్పుడు టేబుల్ సాల్ట్ వాడతారని దీని వల్ల టైప్ 2 మధుమేహం 40 శాతం పెరిగే  అవకాశం ఉందని కొత్త పరిశోధనలో తేలిందని తులనే యూనివర్సిటీ పరిశోధకులు  చెబుతున్నారు.

రోజుకు  రెండు టీ స్పూన్ల ఉప్పుును తీసుకునే వారిలో డయాబెటిస్ ముప్పుు  ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఉప్పుతో డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రోజు 1500 మి. గ్రా లకు మించి ఉప్పు వాడరాదని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు బీపీ, షుగర్‌ సహా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు