San Rechal Gandhi : అందమైన విజయం

5 Nov, 2023 01:02 IST|Sakshi

వైరల్‌

పాండిచ్చేరికి చెందిన సాన్‌ రేచల్‌ గాంధీ తన శరీరం రంగు కారణంగా వివక్షత, అవహేళనలను ఎదుర్కొంది. బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు బంధువులు, కుటుంబ సభ్యులకు నుంచి కూడా వెక్కిరింపులు ఎదుర్కొంది. ఈ వెక్కిరింపులు తట్టుకోలేక తన స్కిన్‌ కలర్‌ మార్చుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్‌ను వాడేది. అయితే ఆ ప్రయత్నాలేవీ ప్రయత్నించలేదు. ఒకానొక దశలో రేచల్‌కు విసుగొచ్చి ‘ఇదంతా ఏమిటి!’ అనుకుంది. ‘నేను నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు’ అనుకుంటూ తన రంగును ప్రేమించడం మొదలు పెట్టింది.

ఇలా ఉంటే మాత్రమే, ఈ రంగులో ఉంటేనే అందాల పోటీల్లో విజేతలు అవుతారనే స్టీరియోటైప్‌ ఆలోచనలను బ్రేక్‌ చేయాలి, సెల్ఫ్‌–యాక్సెప్టెన్స్‌ను ప్రమోట్‌ చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కొన్ని పోటీల్లో స్కిన్‌ కలర్‌ కారణంగా రిజెక్ట్‌ చేశారు. అయినా పట్టువదలకుండా అందాల పోటీల్లో పాల్గొనేది. ఎన్నో బ్యూటీ టైటిల్స్‌ కూడా గెలుచుకుంది. గత సంవత్సరం ‘మిస్‌ పాండిచ్చేరి’ కిరీటాన్ని గెలుచుకుంది.

‘ఒక డార్క్‌–స్కిన్‌ మోడల్‌ను టీవీలో చూసిన తరువాత నాకు కూడా మోడలింగ్‌ చేయాలనిపించింది’ అంటున్న రేచల్‌ ఒక జువెలరీ బ్రాండ్‌కు మోడలింగ్‌ చేసింది. మోడల్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయానికి వస్తే సౌత్‌ ఆఫ్రికాలో జరగనున్న ‘మిస్‌ ఆఫ్రికా గోల్డెన్‌’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది.

మరిన్ని వార్తలు