సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌

10 Nov, 2023 13:42 IST|Sakshi

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (నవంబర్‌ 10) ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం సౌతాఫ్రికా రెండు మార్పులు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్‌ తబ్రేజ్‌ షంషి, మార్కో జన్సెన్‌లకు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో ఆండిలే ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కోయెట్జీలను తుది జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు..

ఆఫ్ఘనిస్తాన్‌: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్‌), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), టెంబా బవుమా (కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి

మరిన్ని వార్తలు