70 ఏళ్ల వయసులో ఉగాండా మహిళ అరుదైన రికార్డ్‌..

5 Dec, 2023 12:57 IST|Sakshi

సాధారణంగా 35-40 ఏళ్లు దాటితేనే ప్రెగ్నెన్సీ కష్టమనుకుంటున్న రోజుల్లో 70 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది.ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ వయసు 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది.

నముక్వాయా 1992లో భర్తను కోల్పోయింది. దీంతో నాలుగేళ్లకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సుమారు 20 ఏళ్లకు సఫీనా ఐవీఎఫ్‌ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన వెంటనే చనిపోవడంతో సఫీనా చాలా కుంగిపోయింది. దీంతో తల్లి కావలన్నా తన కోరికను 70 ఏళ్ల వయసులో తీర్చుకుంది. రెండోసారి కూడా ఐవీఎఫ్‌ ప్రక్రియ ద్వారా ఆమె కవలలకు జన్మనిచ్చింది.

కవలల్లో ఒకరు పాప కాగా, మరొకరు బాబు ఉన్నారు. ప్రస్తుతం తల్లితో సహా పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది.

>
మరిన్ని వార్తలు